సూపర్ స్పీడ్‌తో జైలవకుశ షూటింగ్

0

ఇటు జైలవకుశ షూటింగ్, అటు బిగ్ బాస్ షో షూటింగ్‌తో బిజీబిజీగా గడుపుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇటీవలే బిగ్ బాస్ షో ప్రారంభమైంది. ప్రారంభ వేడుకల్లో అదరగొట్టిన తారక్.. అదే జోరుతో జైలవకుశ షూటింగులోనూ పాల్గొంటున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌కు విశేషమైన స్పందన కూడా వచ్చింది. తాజాగా జైలవకుశ గురించి ఆసక్తికరమైన అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు తారక్.

 

ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ పుణెలో జరుగుతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు తారక్. ‘‘సమర్థవంతమైన, అంకితభావంగల చిత్రయూనిట్‌తో సూపర్ స్పీడ్‌గా పుణెలో జైలవకుశ షూటింగ్’’ అంటూ ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. ట్వీట్‌తో పాటు ఆన్‌లొకేషన్ ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం బిగ్ బాస్ ‌షో షూటింగ్ కూడా పుణెకు దగ్గర్లోని లోనావాలాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండింటికీ వీలు కుదిరేలా జైలవకుశ షూటింగ్‌ను కూడా పుణెలోనే ఏర్పాటు చేయడం విశేషం.

Comments

Share.

Comments are closed.