ఎన్టీఆర్, సుకుమార్ కాంబినేషన్లో మరో మూవీ

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని ఎవరూ ఊహించినట్టుగా చూపించారు సుకుమార్. నాన్నకు ప్రేమతో సినిమాలో హాలీవుడ్ స్టార్ గా తారక్ కనిపించారు. ఈ కొత్త కథ, డిఫెరెంట్ లుక్ అభిమానులకు భలే నచ్చింది. విజయాన్ని అందించారు. మరోసారి సుకుమార్ డైరెక్షన్‌లో తమ హీరోను చూసుకోవాలని ఆశపడుతున్నారు. ఆ ఆశ త్వరలోనే తీరనుంది. వీరిద్దరి కాంబినేషన్లో మరో మూవీ తెరకెక్కనుంది. ఈ విషయాన్నీ సుకుమార్ అధికారికంగా ప్రకటించారు.

 

తన నిర్మాణంలో రూపుదిద్దుకున్న ‘దర్శకుడు’ ఆడియో ఫంక్షన్‌లో సుకుమార్ ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్‌తో మళ్లీ సినిమా ఎప్పుడు తీస్తారు? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు “ప్రస్తుతం కథ చర్చల దశలోనే ఉంది” అని సమాధానమిచ్చారు. దీంతో అభిమానులు చాలా సంతోషపడ్డారు. కథ తొందరగా కొలిక్కి వచ్చి, సినిమా పట్టాలెక్కాలని కోరుకుంటున్నారు. నాన్నకు ప్రేమతో తర్వాత చేయనున్న మూవీపై అంచనాలు భారీగా ఉంటాయనే విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Comments

Share.

Comments are closed.