‘సమ సమాజ్‌ పార్టీ’ నాయకుడిగా ఎన్టీఆర్‌

0

‘సమ సమాజ్‌ పార్టీ’తో ఎన్టీఆర్‌ ఏంటి? అనుకుంటున్నారా.. ఇది నిజ జీవితంలో అనుకొని పొరపడకండి. ఆయన పార్టీలో చేరింది తన తర్వాత చిత్రం కోసం. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. బాబీ దర్శకుడు. ఇటీవల విడుదలైన ‘జై’ టీజర్‌లో ఎన్టీఆర్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపించి మెప్పించారు. కాగా ఈ సినిమా సెట్‌లో తీసిన కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

ఇందులో ‘సమ సమాజ్‌ పార్టీ’ బ్యానర్లపై ఎన్టీఆర్‌ ఫొటో కనిపిస్తోంది. సినిమాలో పార్టీ ప్రచారం షూట్‌ కోసం వాహనానికి బ్యానర్లు కట్టినట్లు తెలుస్తోంది. అంటే ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో రాజకీయ నాయకుడిగా కూడా కనిపించబోతున్నారా? అనే వూహాగానాలు వినిపిస్తున్నాయి. పొలిటికల్‌ నేపథ్యం కూడా ఉండటంతో ఎన్టీఆర్‌ పాత్ర ఇంకా పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు చెబుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో చిత్ర బృందం చెప్పాక తెలుసుకోవాల్సిందే.

 

ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో మూడు పాత్రల్లో నటిస్తున్నారు. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 21న ‘జై లవకుశ’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Source: Eenadu

Comments

Share.

Comments are closed.