ఎన్టీఆర్ వచ్చాడు… హుషారెత్తించేశాడు…!

0

బిగ్ బాస్ షోతో బుల్లితెర మీదకు వచ్చిన తారక్ అనుకున్నట్టుగానే అదరగొట్టేస్తున్నాడు. ఎంట్రీ ఎపిసోడ్ వారెవా అనిపించేసిన తారక్ అదే రేంజ్ లో వారం రోజులుగా హౌజ్ లో జరిగే విషయాల గురించి చెబుతూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి హుశారెత్తించాడు. ఈరోజు షోకి కొత్త కలరింగ్ వచ్చింది అంటే అది కచ్చితంగా ఎన్.టి.ఆర్ వల్లనే. 

 

హోస్టింగ్ లో కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటూ తారక్ పర్ఫార్మెన్స్ కు మాటలు రావట్లేదంటే నమ్మాలి. వారం రోజులుగా హౌజ్ మెట్స్ గా తగవులాడుతున్న వారి గురించి నా టివి అని అందరిని సోఫాలో కూర్చోబెట్టి ఒక్కొక్కరిని వాయించిన తీరు అదరహో అని చెప్పాలి. వారం రోజులకే మాడిపోయి ఉన్న ఆ హౌజ్ మెట్స్ లో కూడా తారక్ ప్రెజెన్స్ ఉత్సాహాన్ని తెచ్చింది.

 

హౌజ్ మెట్స్ వారి పనులు ఒక్కొక్కటి వివరిస్తూ చెప్పే తారక్ ను చూస్తే.. తననే హోస్ట్ గా ఎందుకు అనుకున్నారో అర్ధమవుతుంది. ఇక వారం ముగిసింది ఎలిమినేషన్ తప్పనిసరి.. నాటకీయ పరిణామాల మధ్య జ్యోతి, హరితేజ, కత్తి మహేష్ ల మధ్య ఎలిమినేషన్ టార్గెట్ వచ్చింది. ఈ ఎలిమినేషన్ విధానం కూడా లడ్డూ పెడుతూ చెప్పించడం కొత్తగా అనిపించింది. కచ్చితంగా ఇదేదో ముందే అనుకుని చేస్తున్న షో మాత్రం అనిపించదు. మొత్తానికి బిగ్ బాస్ మొదటి రోజు ఎంత హుషారు తెచ్చిపెట్టిందో ఇప్పుడు తారక్ ఎంట్రీతో కూడా అదే జోష్ కొనసాగించింది.

 

Comments

Share.

Comments are closed.