బుల్లితెరపై బిగ్ బాస్ హవా

0

స్టార్ హీరో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో ఇప్పుడు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ తరహా షో తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటుందో అన్న అనుమానాలకు ఫుల్ స్టాప్ పెడుతూ బిగ్ బాస్ రికార్డ్ టీఆర్పీలను సాధించింది. తారక్ ఫ్యాన్స్ తో పాటు రియాల్టీ షో అభిమానులు కూడా ఈ షోను ఎంజాయ్ చేస్తున్నారు. బిగ్ బాస్ షోనే ప్రసారం చేస్తున్న స్టార్ మా ఛానల్ టీఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోతోంది.

 

ముఖ్యంగా వారాంతంలో ఎన్టీఆర్ కనిపించే ఎపిసోడ్స్ లో రేటింగ్ భారీగా ఉంటోందని సమాచారం. స్టార్ మా ప్రకటించిన అధికారిక సమాచారం ప్రకారం టీఆర్ఫీ 16.18 గా నమోదైంది.ఇటీవల కాలంలో ఒక ఛానెల్’కు ఇంతటి టీఆర్ఫీ రాలేదు. ఇన్నాళ్లు నాలుగోస్థానంలో ఉన్న స్టార్ మా బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన తరువాత మొదటి స్థానానికి రావటం విశేషం.

 

 

Comments

Share.

Comments are closed.