ఎన్టీఆర్’కి నాగ్ అభినంద‌నలు

0

వెండితెర‌పై రికార్డుల మ్రోత మోగించిన ఎన్టీఆర్ రీసెంట్ గా బిగ్ బాస్ షోతో బుల్లితెర‌కి ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. 12 మంది సెల‌బ్రిటీలు, 70 రోజులు, 60 కెమెరాల మ‌ధ్య ఈ షో ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఈ షోకి టీ ఆర్పీ రేటింగ్ 16.18 గా వ‌చ్చిన‌ట్టు తెలుస్తుండ‌గా, గ‌తంలో ఏ రియాలిటీ షో కి కూడా ఇంత రేటింగ్ రాలేద‌ని అంటున్నారు.

 

దీంతో ఈ షోని హోస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ కి అభిమానుల నుండే కాదు సెల‌బ్రిటీల నుండి అభినంద‌నలు అందుతున్నాయి. తాజాగా కింగ్ నాగార్జున త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎన్టీఆర్ ని ప్ర‌శంసించారు. తొలి వారంలో సాధించిన ఘ‌న‌త‌కి అభినంద‌న‌లు. నీ ఎనర్జీ నాకు ఎంత‌గానో నచ్చుతుంద‌ని ట్వీట్ చేశాడు నాగ్.

 

దీనికి వెంట‌నే రియాక్ట్ అయిన ఎన్టీఆర్ కింగ్ నాగ్ కి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తూ.. బుల్లితెర‌పై మీరు ఒక ట్రెండ్ సెట్ చేశారు. మా లాంటి వారికి ఓ మార్గం చూపారని రిప్లై ఇచ్చాడు జూనియ‌ర్. నాగార్జున మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు కార్య‌క్ర‌మంతో బుల్లితెర‌కి ఎంట్రీ ఇచ్చి అల‌రించిన సంగ‌తి తెలిసిందే.

 

Comments

Share.

Comments are closed.