ఎన్టీయార్‌ నిజంగానే ‘బిగ్‌బాస్‌’!

0

తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా ప్రారంభమైన ‘బిగ్‌బాస్‌’ బుల్లితెర మీద ఆ స్థాయిలోనే విజయవంతమైంది. వెండితెర మీద వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న ఎన్టీయార్‌ బుల్లితెర మీద కూడా సత్తా చాటాడు. ‘బిగ్‌బాస్‌’ షోకు తెలుగు టెలివిజన్‌ చరిత్రలోనే ఎన్నడూ లేనంత హయ్యస్ట్‌ టీఆర్పీ రేటింగ్‌ను అందించాడు ఎన్టీయార్‌.

 

ఈ దెబ్బకు గత వారానికిగానూ ‘బిగ్‌బాస్‌’ నెంబర్‌ వన్‌ రియాలిటీ షోగా, సదరు ఛానెల్‌ నెంబర్‌ వన్‌ ఎంటర్‌టైన్‌ ఛానల్‌గా నిలిచాయి. గత ఆదివారం ఎన్టీయార్‌ హోస్ట్‌ చేసిన ‘బిగ్‌బాస్‌’ షోకు ఏకంగా 16.8 టీఆర్పీ రేటింగ్‌ వచ్చింది. మొత్తం వారానికి 10.4 టీఆర్పీ వచ్చింది.

 

అంతేకాదు ఇప్పటివరకు టీవీ షోలను హోస్ట్‌ చేసిన సెలబ్రిటీలపరంగా కూడా ఎన్టీయార్‌ ఎవరికీ అందనంత స్థాయిలో టీఆర్పీని సాధించాడు.

 

Comments

Share.

Comments are closed.