జైలవకుశ రికార్డు సృష్టించనున్న సాంగ్

0

బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ షూటింగ్ వేగంగా సాగుతోంది. ప్రస్తుతం పూణేలోని పెద్ద ప్యాలస్ లో కీలక సీన్లు తెరకెక్కిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు అక్కడే కొనసాగే షెడ్యూల్లో ఓ పాట కూడా షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ చిత్రీకరణకు ముందే వార్తల్లోకెక్కింది.

 

ఎందుకంటే ఈ పాటలో ఎన్టీఆర్ 42 జతల డ్రస్సులను మార్చనున్నారు. అంతేకాదు మూడు పాత్రలు ఈ పాటలో స్టెప్పులు వేయనున్నారు. త్రిపాత్రాభినయం చేస్తుండడం, అందులో ఒకటి నెగటివ్ షేడ్స్ ఉండడం వంటి అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతుంటే ఈ పాట మరింత ఇంట్రెస్ట్ ని కలిగిస్తోంది.

 

మూడు రకాల మ్యానరిజంలో తారక్ స్టెప్పులు వేస్తుంటే అభిమానులను విజిల్స్ వేయకుండా ఆపలేము. సినిమాలో ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్ర బృందం వెల్లడించింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన నివేదా థామస్, రాశీ ఖన్నా, నందితా రాజ్ లు నటిస్తుండగా, విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ కనిపించనున్నారు.

 

అభిమానుల్లో, ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న జైలవకుశ సినిమా సెప్టెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

Share.

Comments are closed.