మరోసారి మనసులు గెలిచిన తారక్..!

0

బిగ్ బాస్ వస్తుంది అంటే స్టార్ మా ట్యూన్ చేసుకుని అందరు టివిలకు అతుక్కుపోయే పరిస్థితి వచ్చింది. అదికాకా శని ఆదివారాలు ఎన్.టి.ఆర్ వస్తాడు కాబట్టి మరింత క్రేజ్. అనుకున్నట్టుగానే అదే జోష్ తో మరోసారి ప్రత్యక్షమైన తారక్ ఈ శనివారం కూడా తన మాటలతో అందరిని ఆకట్టుకున్నాడు.

 

ఈసారి ఎలిమినేషన్ ప్రక్రియను హడావిడి చేయకుండా మధుప్రియ అని ఎనౌన్స్ చేశారు. ఇక ఈనాటి ప్రోగ్రాంలో హైలెట్ ఏంటంటే కత్తుల సింహాసనం తెచ్చి హౌజ్ మెట్స్ విలన్లను చెప్పమంటే దాదాపు ఏడుగురు దాకా కల్పనను విలన్ చేశారు. ఇక ఆ తర్వాత సమీర్ కూడా ముగ్గురికి విలన్ అయ్యాడు. అన్నిటికి మించి ఈవారం ఎపిసోడ్ లో హైలెట్ ఏంటంటే మహేష్ కత్తి వండిన చికెన్ తన దగ్గరకు తెప్పించుకుని మరి తినేశాడు తారక్. అలా ఇలా తినడం కాదండి స్టేజ్ మీద కింద కూర్చుని తినడం ఈ షోని ప్రేక్షకులకు చేరవేయడంలో ఎన్టీఆర్ వేటిని పట్టించుకోవట్లేదని చెప్పొచ్చు.

 

ఇక ఎప్పటిలానే ఎన్.టి.ఆర్ హౌజ్ మెట్స్ తో ఇంటరాక్ట్ అయ్యే విధానం బాగుంది. మొత్తానికి తారక్ మళ్లీ ఈ శనివారం బిగ్ బాస్ ను టాప్ రేంజ్ లో నిలబెట్టాడు. ముఖ్యంగా తారక్ లాంటి స్టార్ హీరో బుల్లితెర వ్యాఖ్యాతగా ఇంత తక్కువ టైంలో చక్కగా ఒదిగిపోవడం గొప్ప విషయమని చెప్పొచ్చు.

Comments

Share.

Comments are closed.