తెలుగు టెలివిజన్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న ఎన్టీఆర్

0

వెండితెరపై ఇరవై ఏళ్లకే రికార్డులు బద్దలు కొట్టిన యంగ్ టైగర్ ఎన్టీఆర్… బుల్లి తెరపై కూడా సంచలనం సృష్టిస్తున్నారు. స్టార్ మా ఛానల్లో తారక్ తొలి సారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో తొలి ఎపిసోడ్ జులై 16 న ప్రసారమైంది. ఆ రోజు ప్రసారమైన షోకి 16.18 టీఆర్పీ(టెలివిజన్ రేటింగ్ పాయింట్) నమోదైంది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన షోలకు కూడా ఇంతలా రేటింగ్ నమోదు కాలేదు. తొలివారం నుంచి ప్రేక్షకులను పెంచుకుంటూ ఈ షో దూసుకుపోతోంది. తాజాగా ఈ షో రెండో వారం రెస్పాన్స్ గణాంకాలు బయటికి వచ్చాయి. ఇందులోనూ అత్యధిక టీవీఆర్ (టెలివిజన్ వీవర్స్ రేటింగ్) నమోదు చేసుకుంది. వారం మొత్తం సరాసరిగా 10 టీవీఆర్ వచ్చింది.

 

ఆదివారం ఈ రేటింగ్ 12 .7 కి చేరింది. వారాంతంలో ఈ షోని చూసేవారి సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఎన్టీఆర్ అని స్పష్టంగా తెలుస్తోంది. అత్యధిక మంది ఈ షోని చూడడం వల్ల స్టార్ మా ఛానల్ వారి వీవర్స్ నాలుగు రెట్లు పెరిగినట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇలా ఎన్టీఆర్ తొలి అడుగుతోనే బుల్లితెరలో తన సత్తాని చాటారు. సినిమాల్లోనే కాకుండా, టీవీల్లోను తారక్ రికార్డ్స్ నమోదు చేయడం నందమూరి అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది.

Comments

Share.

Comments are closed.