భారీ ధర పలికిన ఎన్టీఆర్ జై లవ కుశ ఓవర్సీస్ రైట్స్

0

జై లవకుశ సినిమా మొదలైనప్పటి నుంచి సంచలనాలకు కేంద్ర బిందువైంది. లోగో రిలీజ్ నుంచి ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అందుకే ఈ సినిమా థియేటర్ రైట్స్ కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు బారులు తీరుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ హక్కులు భారీ రేట్లకు అమ్ముడు పోయి ట్రేడ్ వర్గాల వారిని ఆశ్చర్యపరిచాయి. తాజాగా ఓవర్సీస్ రైట్స్ భారీ ధర పలికి ఎన్టీఆర్ క్రేజ్ ని చాటాయి. హారిక అండ్ హాసిని బ్యానర్ నిర్మాతల్లో ఒకరైన సూర్యదేవర నాగవంశీ తన మిత్రులతో కలిసి యుఎస్ థియేటర్ రైట్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్ నగర వాసులు చెబుతున్నారు.

కాగితాలపై సంతకాలు పూర్తి అయిన వెంటనే ఈ విషయాన్నీ నిర్మాత కళ్యాణ్ రామ్ అధికారికంగా వెల్లడించనున్నారు. బాబీ డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీ సింగపూర్ హక్కులను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ 18 లక్షలకు కోనుగోలు చేసింది. మిగిలిన వరల్డ్ వైడ్ ఏరియాలు కూడా విక్రయించే పనిలో నిర్మాత కళ్యాణ్ రామ్ బిజీ గా ఉన్నట్లు తెలిసింది. తారక్ తొలి సారి త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ సెప్టెంబర్ 21 న రిలీజ్ కానుంది.

Comments

Share.

Comments are closed.