భారీ ధరకు అమ్ముడు పోయిన ‘జై లవకుశ’ సీడెడ్ రైట్స్

0

హ్యాట్రిక్ హిట్ తో ఫుల్ ఫామ్లో ఉన్న ఎన్టీఆర్ జై లవకుశ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ మూవీ సెట్స్ మీద ఉండగానే ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయిపోతోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం థియేటర్ రైట్స్ కొనుగోలు చేయడానికి డిస్ట్రిబ్యూటర్లు బారులు తీరుతున్నారు. నిన్ననే ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ తన మిత్రులతో కలిసి యుఎస్ థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారు. సింగపూర్ హక్కులను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సంస్థ కోనుగోలు చేసింది.

 

కేవలం సీడెడ్ రైట్స్ 12.6 కోట్లు పలకడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఎన్టీఆర్ చిత్రం ఈ స్థాయిలో సీడెడ్ లో అమ్ముడవడం ఇదే తొలిసారి. తారక్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ లో ‘లవ’ పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ రాఖీ సందర్భంగా ఆగష్టు 7 న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 21 న రిలీజ్ కానుంది.

Comments

Share.

Comments are closed.