బిగ్ బాస్ షోలో సందడి చేయనున్న రానా

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెరలో తొలి అడుగుతోనే సంచలనం సృష్టించారు. స్టార్ మా ఛానల్ వారు నిర్మిస్తున్న అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ షోకి తారక్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో గత నెల 16 న ప్రారంభమయి అందరినీ ఆకట్టుకుంటోంది. టీఆర్పీ(టెలివిజన్ రేటింగ్ పాయింట్), టీవీఆర్ (టెలివిజన్ వీవర్స్ రేటింగ్) లోను అత్యధిక పాయింట్స్ ని సాధించి దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ వచ్చే శనివారం, ఆదివారాలలో రేటింగ్ అమాంతం పెరిగిపోతోంది. ఈ వీకెండ్ స్నేహితుల దినోత్సవం సందర్భంగా రానా దగ్గుబాటి ఈ ఆదివారం స్పెషల్ గెస్ట్ గా బిగ్ బాస్ షోకి రాబోతున్నారు.

తాను హీరోగా నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్లో భాగంగా రియాలిటీ షోకి వెళ్ళుతున్నారు. అతను, ఎన్టీఆర్ కలిస్తే సందడే సందడి. ఆ సందడి సండే నాడు డబల్ కానుంది. రానా రాక బిగ్ హౌస్ లోని పార్టిసిపెంట్స్ తో పాటు బుల్లితెర ప్రేక్షకులకు మరింత ఆనందాన్ని పంచనుంది.

Comments

Share.

Comments are closed.