‘లవకుమార్‌’ వచ్చేశాడు

0

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జై లవకుశ’. బాబి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ‘జై’ పాత్రకు సంబంధించిన టీజర్‌ విడుదల చేశారు. ఇప్పుడు చిత్రంలోని రెండో పాత్రైన ‘లవకుమార్‌’ని పరిచయం చేస్తూ ఫస్ట్‌లుక్‌ విడుదల చేశారు. ఈరోజు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని తారక్‌ తొలిపోస్టర్‌ను విడుదల చేశారు. లవకుమార్‌గా సాఫ్ట్‌వేర్‌ గెటప్‌లో తారక్‌ చిరునవ్వులు చిందిస్తూ ఆకట్టుకుంటున్నాడు.ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌ రామ్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌కి జోడీగా రాశీ ఖన్నా, నివేదా థామస్‌ నటిస్తున్నారు. దసరాకి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.

కొద్దినిమిషాల్లోనే మరో పోస్టర్‌
లవకుమార్‌ పోస్టర్‌ను తారక్‌ విడుదల చేసిన కొద్దిసేపటికే ఆయన సోదరుడు కల్యాణ్‌రామ్‌ మరో పోస్టర్‌ను షేర్‌ చేశారు. ‘జై’ పాత్రలో తారక్‌ విలన్‌ గెటప్‌లో ఆకట్టుకుంటే లవకుమార్‌ పాత్రలో బుద్ధిమంతుడిగా ఆకట్టుకుంటున్నారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని అన్నాతమ్ముళ్లు పోస్టర్లు షేర్‌ చేయడంతో అభిమానులకు నిజంగా ఈరోజు పండుగనే చెప్పాలి. ఇప్పటికే లవకుమార్‌ పోస్టర్‌తో ‘జైలవకుశ’ట్రెండింగ్‌లో రెండో స్థానంలో ఉంది.


Comments

Share.

Comments are closed.