ఎన్టీఆర్ వేలికున్న ఉంగరం వెనుకున్న స్టోరీ

0

బిగ్ బాస్ షో ద్వారా తమ అభిమాన హీరోని వారానికి రెండు రోజులు చూసుకునే అవకాశం కల్పించినందుకు స్టార్ మా ఛానల్ వారికి ఎన్టీఆర్ అభిమానులు కృతజ్ఞతలు చెబుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ సొంత విషయాలను తెలుసుకునేందుకు ఈ షో ఉపయోగపడుతోందని సంతోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టిసిపెంట్స్ తమ కుటుంబ సభ్యుల గురించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు… తన భార్య, కొడుకు గురించి ఏదొక విషయాన్నీ తారక్ గుర్తుచేసుకుంటున్నారు. రీసెంట్ గా ధనరాజ్ తన కొడుకు గురించి మాట్లాడుతూ.. ఎమోషన్ అయినపుడు ఎన్టీఆర్ తన వేలికి ఉన్న ఉంగరం కథ చెప్పారు.

ఆ డైమండ్ రింగ్ ని భార్య లక్ష్మీ ప్రణతి తనకి నాన్నకు ప్రేమతో సినిమా సమయంలో గిఫ్ట్ గా ఇచ్చిందని, ఆ ఉంగరంపై ఒకవైపు అభయరామ్ పేరు.. మరొకవైపు లక్ష్మీ ప్రణతి పేరు ఉన్నాయని వివరించారు. ఇందులో నా పేరు ఏది అని ఎన్టీఆర్ తన సతీమణిని అడిగితే… ‘ఆ రెండు పేర్లకూ మధ్యన ఉన్న డైమండ్ నువ్వే డియర్’ అని చెప్పిందట. తనంటే లక్ష్మీ ప్రణతికి ఎంతో ఇష్టమో తెలుసుకొని ఎన్టీఆర్ మురిసిపోయారంట. ఇలా తన సొంత విషయాలను షేర్ చేసుకొని అభిమానులకు ఆనందాన్ని పంచారు.

Comments

Share.

Comments are closed.