రూమర్స్ ని ఖండించిన జైలవకుశ టీమ్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జైలవకుశ సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని మూడు పాత్రల్లో రెండింటిని రిలీజ్ చేశారు. జై మాస్ లుక్ లో అదరగొడితే లవకుమార్ క్లాస్ లుక్ తో ఆకట్టుకున్నారు. లవకుమార్ టీజర్ ని కూడా రిలీజ్ చేయడానికి చిత్ర బృందం శ్రమిస్తోంది. అయితే సినిమా రిలీజ్ విషయంలో రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్ 21న జై లవ కుశ థియేటర్ లోకి రావడంలేదని రూమర్ విహారం చేసింది. దీనిపై చిత్ర బృందం నేడు స్పందించింది. ఈ వార్తలో వాస్తవం లేదని కొట్టిపడేసింది.

ముందుగా ప్రకటించిన తేదీ (సెప్టెంబరు 21) నాడే సినిమా విడుదలవుతుందని స్పష్టం చేసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్నఈ సినిమాలో తారక్ సరసన ఢిల్లీ భామ రాశీ ఖన్నా, నివేత థామస్, నందితరాజ్ నటిస్తున్నారు. ప్రస్తుతం పూణేలోని ప్యాలెస్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్ లో అద్భుత చిత్రంగా నిలుస్తుందని అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు.

Comments

Share.

Comments are closed.