టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ‘జై లవ కుశ’ !

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘జై లవ కుశ’ శరవేగంగా జరుగుతోంది. టీమ్ గ్యాప్ లేకుండా వరుస షెడ్యూళ్లతో షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ మొత్తం పూర్తైపోగా కేవలం పాటల చిత్రీకరణ మిగిలి ఉందని సమాచారం. అలాగే చిత్ర రిలీజ్ పై వచ్చిన వాయిదా పుకార్లను కూడా టీమ్ కొట్టి పారేసింది. ముందు చెప్పిన ప్రకారమే సెప్టెంబర్ 21న సినిమా రిలీజ్ అవుతుందని నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ తెలిపింది.

తారక్ ఈ చిత్రంలో జై, లవ, కుశ అనే మూడు పాత్రల్లో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్ విశేషంగా ఆకట్టుకోవడంతో సినీ ప్రియులు, అభిమానులు సినిమా పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారు. దర్శకుడు బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో నివేతా థామస్, రాశి ఖన్నాలు హీరోయిన్లుగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Comments

Share.

Comments are closed.