ఎన్టీఆర్‌ వినాయకచవితి కానుక

0

ఎన్టీఆర్‌ తన సినీ కెరీర్‌లో తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. బాబీ దర్శకుడు. రాశీ ఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు.

కాగా ‘లవ’ పాత్రకు సంబంధించిన టీజర్‌ను వినాయక చవితి పండగ సందర్భంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘కుశ’ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను నెలాఖరులోగా విడుదల చేయనున్నట్లు పేర్కొంది. మరి తారక్‌ అభిమానులకు ఇది పండగ కానుక లాంటిదేగా.

ఇప్పటికే ఈ చిత్రంలోని ‘జై’ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను, ‘లవ’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రచార చిత్రాలకు సోషల్‌మీడియాలో విశేషమైన స్పందన వచ్చింది. దసరా సందర్బంగా సెప్టెంబర్ 21న భారీ అంచనాల నడుమ ‘జైలవకుశ’ సినిమా విడుదలకానుంది. 

Comments

Share.

Comments are closed.