జై లవకుశ ఆడియో విడుదల తేదీ

0

రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాలు నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యాయి. వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న సినిమా జై లవకుశ. ఇందుకోసం మాస్, క్లాస్ అభిమానులను అలరించే ట్యూన్స్ దేవీ కంపోజ్ చేశారు. ఆ పాటలు వినే సమయం దగ్గరికి వచ్చింది. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం పోషిస్తున్న ఈ సినిమాలో రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. వినాయకచవితికి లవకుమార్ టీజర్ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 21 న రిలీజ్ కాబోతోంది.

ఈ సినిమా పాటలను సెప్టెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం నిర్ణయించుకుంది. డేట్ ఖరారు కాగానే అధికారికంగా ప్రకటించనుంది. నివేదా థామస్, రాశీ ఖన్నా, నందిత రాజ్ లు హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ క్యారక్టర్ జై హైలెట్ కానుందని సమాచారం. ముఖ్యంగా మూడు పాత్రల మధ్య వచ్చే సన్నివేశాలు తారక్ అభిమానులకు కనుల విందు అందిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెప్పారు.

Comments

Share.

Comments are closed.