త్రివిక్రమ్ సినిమాలో కాలేజీ స్టూడెంట్ గా ఎన్టీఆర్

0

ఎన్టీఆర్ అప్పుడే కొత్త సినిమా సన్నాహాల్లో తలమునకలయ్యారా? ఆ సినిమా కోసం భారీగా బరువు తగ్గనున్నారా? ఆ పనుల్ని కూడా అప్పుడే మొదలెట్టేశారా? ఈ ప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానమే వినిపిస్తోంది. 

ప్రస్తుతం ‘జైలవకుశ’లో నటిస్తున్న ఎన్టీఆర్ తదుపరి త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఆ చిత్రం కోసం ఇప్పటికే ముహూర్తం కూడా ఖరారైందని సమాచారం. వచ్ఛే నెలలోనే కొబ్బరికాయ కొట్టబోతున్నట్లు సమాచారం. ఆ చిత్రం లో ఎన్టీఆర్ కాలేజీకెళ్లే కుర్రోడిగా స్లిమ్ గా కనిపించబోతున్నారట. త్రివిక్రమ్ సలహా మేరకు ఎన్టీఆర్ ఇప్పటికే కసరత్తులు కూడా షురూ చేసినట్టు తెలిసింది. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా తారక్ ని త్రివిక్రమ్ చూపిస్తాడనడంలో ఎటువంటి సందేహాం అవసరం లేదు.

ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ డైరక్షన్లో జైలవకుశ సినిమా చేస్తున్నారు. జైలవకుశ లోని ‘జై’ పాత్ర కోసం కొంచెం బొద్దుగా మారారు తారక్. ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయింది. రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో కొత్త సినిమా ఆరంభం దగ్గరపడుతోంది కాబట్టి ఎన్టీఆర్ స్లిమ్ గా మారేందుకు నిపుణుల సలహాలు తీసుకుంటూ కసరత్తులు మొదలెట్టారని తెలిసింది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలయికలో వచ్ఛే సినిమా కూడా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుని, వచ్ఛే వేసవిలో విడుదల కానుందని సమాచారం. 

Comments

Share.

Comments are closed.