నాల్గవ వారంలోనూ ఎన్టీఆర్ షో నెంబర్ 1

0

పోటీలో అడుగుపెడితే నంబర్ వన్ స్థానం సొంతమయ్యేవరకు కష్టపడే నటుడు ఎన్టీఆర్. వెండితెరపై ఎప్పుడో తన సత్తాని చాటిన తారక్ తాజాగా బుల్లితెరపై అడుగుపెట్టి సంచలనం సృష్టిస్తున్నారు. స్టార్ మా ఛానల్లో ఎన్టీఆర్ తొలిసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షో తొలి ఎపిసోడ్ జులై 16 న ప్రసారమైంది. ఆ రోజు ప్రసారమైన షోకి 16.18 టీఆర్పీ (టెలివిజన్ రేటింగ్ పాయింట్) నమోదైంది. తెలుగులో నంబర్ వన్ షో గా నిలిచింది. రెండో వారంలోనూ అత్యధిక టీవీఆర్ (టెలివిజన్ వీవర్స్ రేటింగ్) నమోదు చేసుకొని మొదటి స్థానాన్ని కొనసాగించింది. ఇక మూడోవారం హౌస్ లోకి రానా వచ్చారు.

అంతేకాదు కొత్త టాస్క్ లతో ఈ షో అందరినీ ఆకట్టుకుంటోంది. సో వరుసగా నాల్గవ వారంలోను అత్యధిక టెలివిజన్ వీవర్స్ రేటింగ్ పాయింట్స్ సాధించి నంబర్ వన్ కిరీటాన్ని అందుకుంది. ఈ వారం నవదీప్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి జోష్ పెంచాడు. అంతేకాకుండా శని, ఆదివారాల్లో ఎన్టీఆర్ తనదైన శైలిలో మాట్లాడుతూ రేటింగ్ ని అమాంతం పెంచనున్నారు. కాబట్టి ఐదవ వారంలోను నంబర్ వన్ బిగ్ బాస్ సొంతమని టెలివిజన్ వర్గాలు వెల్లడించాయి.

Comments

Share.

Comments are closed.