‘సినిమా ప్రమోషన్’కు సరికొత్త విధానాన్ని ప్రారంభిస్తున్న ఎన్టీఆర్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకి సంబంధించి ఏ స్టిల్ వచ్చినా, టీజర్ వచ్చిన సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించడం ఆనవాయితీగా మారింది. హ్యాట్రిక్ హిట్ తో దూసుకుపోతున్న తారక్ కి నెటిజన్లలోనూ విపరీతమైన క్రేజ్ ఉందనడానికి ఇదో నిదర్శనం. ఆ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని సరికొత్త విధానానికి తెర లేపారు. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవకుశ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇందులోని ఒక క్యారక్టర్ అయిన జై టీజర్ విడుదలై విశేషంగా ఆకట్టుకోగా, లవ కుమార్ కి సంబంధించిన టీజర్ వినాయకచవితికి రిలీజ్ కానుంది.

మూడో పాత్ర కుశ టీజర్ తో పాటు ఈ మూడు పాత్రలకు సంబంధించిన ఎమోజీ ఐకాన్స్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ లో ఈ విధానాన్ని ట్యూబ్ లైట్ సినిమాతో సల్మాన్ ఖాన్ ప్రారంభించారు. కోలీవుడ్ లో విజయ్ తన కొత్త మెర్సల్ (తెలుగులో అదిరింది) స్టిల్ ను కూడా ఎమోజీగా రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. టాలీవుడ్ లో తొలిసారి ఎన్టీఆర్ ఈ ఎమోజీ లను రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం 50 లక్షలు ఖర్చు అవుతున్నప్పటికీ నిర్మాత కళ్యాణ్ రామ్ వెనుకడుగు వేయలేదు. వాటిని చాలా ఆకర్షణీయంగా తయారు చేయిస్తున్నారు.

Comments

Share.

Comments are closed.