ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాపై లేటెస్ట్ అప్డేట్!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దాదాపు అగ్ర దర్శకులందరితో కలిసి వర్క్ చేశారు. అలానే దర్శకుడు త్రివిక్రమ్ చాలా మంది స్టార్ హీరోలతో కలిసి పని చేశాడు. మొదటిసారిగా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రూపొందనుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… ఈ సినిమా నవంబర్ 1 నుండి సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ సినిమాలు నిర్మించిన నిర్మాత రాధాకృష్ణ ఈ సినిమాను కూడా నిర్మించబోతున్నారు.

త్రివిక్రమ్-పవన్ కల్యాణ్ ల సినిమా పూర్తయిన వెంటనే ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. వచ్ఛే నెలలోనే కొబ్బరికాయ కొట్టబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం లో ఎన్టీఆర్ కాలేజీకెళ్లే కుర్రోడిగా స్లిమ్ గా కనిపించబోతున్నారట. త్రివిక్రమ్ సలహా మేరకు ఎన్టీఆర్ ఇప్పటికే కసరత్తులు కూడా షురూ చేసినట్టు తెలిసింది. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా అను ఎమ్మాన్యూయల్ ను ఎంపిక చేయనున్నారని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తోన్న ‘జై లవకుశ’ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

Share.

Comments are closed.