జై లవకుశ ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్

0

ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవకుశ సినిమా లో రెండు పాటలు మినహా టాకీ పార్ట్ మొత్తం పూర్తైన విషయం తెలిసిందే. చిత్ర బృందం లవకుమార్ టీజర్ ని ఇవాళ (ఆగస్టు 24) రిలీజ్ చేసే పనిలో ఉంది. నిర్మాత కళ్యాణ్ రామ్ మాత్రం ఆడియో రిలీజ్ కార్యక్రమ సన్నాహాల్లో ఉన్నారు,  వచ్చే నెల మూడవ తేదీన పాటల వేడుకను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన గత చిత్రాలు నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయ్యాయి.

వరుసగా వీరిద్దరి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మూడో సినిమా జై లవకుశ. దీంతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని మాస్, క్లాస్ అభిమానులను అలరించే ట్యూన్స్ దేవీ కంపోజ్ చేశారు. ఈ పాటలను పదిరోజుల్లో విననున్నాం. ఎన్టీఆర్ సరసన  నివేదా థామస్, రాశీ ఖన్నా, నందిత రాజ్ లు  నటిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 21 న రిలీజ్ కాబోతోంది.

Comments

Share.

Comments are closed.