నాటీ బాయ్… ‘కుశ’ వచ్చేశాడోచ్‌!

0

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. బాబీ (కె.ఎస్‌. రవీంద్ర) దర్శకుడు. ఈ చిత్రంలో తారక్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా శుక్రవారం వినాయక చవితి సందర్భంగా మూడో పాత్ర ‘కుశ’కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

ఈ ప్రచార చిత్రంలో ఎన్టీఆర్‌ చాలా ట్రెండీగా, ఉత్సాహంగా కనిపించారు. ‘జై’కి విలన్‌ లక్షణాలు, ‘లవ’కు మంచి బాలుడి లక్షణాలు ఉంటే.. ఈ ‘కుశ’ మాత్రం అట్రాక్టివ్‌ బాయ్‌గా కనిపించి అభిమానులను మరింతగా ఆకట్టుకుంటున్నారు. ‘జై’, ‘లవ’ పాత్రలకు సంబంధించిన టీజర్లను ఇప్పటికే విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటికి మంచి స్పందన వచ్చింది. ఈ నెలాఖరున కుశ టీజర్ ను కూడా రిలీజ్ చేసి సెప్టెంబర్ 3న అభిమానుల మధ్యలో కనుల పండుగగా ఆడియో రిలీజ్ ను ఘనంగా నిర్వహించాలని చూస్తుంది చిత్రబృందం.

ప్రస్తుతం చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. సెప్టెంబరు 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.


Comments

Share.

Comments are closed.