మొదటి స్థానం,రెండవ స్థానం కూడా ఎన్టీఆర్ దే

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైమ్ ఇప్పుడు మాములుగా లేదు… గట్టిగా బలంగా బంతి ని నేలకేసి కసిగా కొడితే పై పైకి ఎలా పోతుందో… ఎన్టీఆర్ రికార్డుల వరస కూడా అలాగే కొనసాగుతుంది. టెంపర్ సినిమా ఆడియో ఫంక్షన్ లో చెప్పినట్లు తన సినిమా విజయం సాధించినా లేకున్నా ఫ్యాన్స్ ని మాత్రం తల ఎత్తుకొనేలా తన సినిమాలు ఉంటాయని… అలాగే చేస్తానని ఏ క్షణంలో చెప్పాడో కానీ అవార్డుల మీద అవార్డులు మరియు రివార్డులు ఎన్నో ఎన్నెన్నో.

సోషల్ మీడియా లో అయితే ఎన్టీఆర్ కి సంబందించిన ఏ చిన్న వార్త అయినా సరే టాప్ ట్రెండింగ్ లో నిలవాలసిందే. అలాంటిది జై లవకుశలో మూడు పాత్రలు చేస్తూ మూడు వేర్వేరు టీజర్లంటే ఇక రికార్డులెలా ఉంటాయి? ఒకప్పుడు ఒక వీడియో కి మిలియన్ వ్యూస్, లక్ష లైకులు రావటం అంటే మామూలు విషయం కాదు.. కానీ ఇప్పుడు చాలా సాధారణమైన విషయం అయిపొయింది.

కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సాధించిన ఘనత మాత్రం మాములు విషయం మాత్రం కాదు అరాచకమే. అవును టాలీవుడ్ లో ఫాస్ట్ గా లక్ష లైకులు, రెండు మిలియన్ల వ్యూస్ సాధించిన మొదటి రెండు స్థానాల్లో ఎన్టీఆర్ ని నిలబెట్టడం మాత్రం మాములు విషయం కాదు. వారి కోసం ఎన్టీఆర్ ఎంత కష్ట పడుతున్నాడో అంతే విధంగా ఫ్యాన్స్ కూడా తనని టాప్ లో నిలబెడుతున్నారు… హ్యాట్స్ ఆఫ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ !!

Comments

Share.

Comments are closed.