లక్కీ షోగా టాలీవుడ్ లో పేరు దక్కించుకున్న ఎన్టీఆర్ షో

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ షో టెలివిజన్ రికార్డులన్నింటికీ రిపేర్లు చేస్తోంది. టెలివిజన్ రేటింగ్ పాయింట్ లోను, టెలివిజన్ వీవర్స్ పాయింట్ లోను అత్యధిక పాయింట్స్ రాబట్టి మొదటి స్థానం లో దూసుకుపోతోంది. ఈ షో వల్ల స్టార్ మా ఛానల్ ని చూసే వారి సంఖ్య నాలుగు రేట్లు పెరిగిందంటే ఎన్టీఆర్ హోస్టింగ్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. తాజాగా ఈ షోకి టాలీవుడ్ వర్గాల వారు “లక్కీ షో”గా పేరు పెట్టారు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లోకి గెస్ట్ గా ఎవరైతే అడుగుపెడతారో వారి సినిమా సూపర్ హిట్ అవుతుందనే టాక్ విస్తరిస్తోంది.

ఈ హౌస్ లోకి ముందుగా దగ్గుబాటి రానా వెళ్లారు. పార్టిసిపెంట్స్ తో కలిసి సందడి చేశారు. ఎన్టీఆర్ తో కలిసి నవ్వులు పూయించారు. ఆయన నటించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా విశేషాలు పంచుకున్నారు. కట్ చేస్తే ఆ సినిమా గట్టి పోటీని తట్టుకొని ఘనవిజయం సాధించింది. రెండో సారి తాప్సి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళింది. తాను నటించిన ఆనందో బ్రహ్మ మూవీ ప్రచారం కోసం వెళ్లిన ఆమెకు… షో మంచి ఫలితాన్ని అందించింది. ఈ సినిమా ఊహించని విజయం అందుకుంది.

తర్వాత  విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ లోకి గెస్ట్ గా వెళ్లారు. రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన అతని చిత్రం అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ హిట్ గా టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఫిలిం నగర్ లో బిగ్ బాస్ షో గురించి మాట్లాడుకోవడం పెరిగింది. ఈ సెంటిమెంట్ తో మరికొంతమంది షోలో గెస్ట్ గా వెళ్లాలని ఆలోచిస్తున్నారు.

Comments

Share.

Comments are closed.