ఒకే పాటలో కనువిందు చేయనున్న లవ, కుశ

0

పూణే షెడ్యూల్ తో జై లవకుశ టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాలో రెండు పాటల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. అందులో ఒక పాటను రామోజీ ఫిలింసెట్ లో వేసిన ప్రత్యేక సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ రోజు మొదలైన ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ తో పాటు 200 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ కి సంబంధించిన ఒక ఫోటోని చిత్ర బృందం ట్విట్టర్లో పోస్ట్ చేసి… అందులో కుశ ఎక్కడున్నారో కనిపెట్టమని అభిమానులను ప్రశ్నించింది. అందుకు ఎన్టీఆర్ అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ఈ పాటలో కుశ మాత్రమే కాదు లవ కుమార్ కూడా పాల్గొన్నారని కొత్త విషయాన్నీ కనిపెట్టి చెప్పారు అభిమానులు.

డ్యాన్సర్ల తో కలిసి కుశ స్టెప్పులు వేస్తుంటే, లవకుమార్ మాత్రం బిల్డింగ్ బాల్కనీ లో నిలబడి చూస్తున్నాడని గెస్ చేశారు. అభిమానుల అంచనా కరెక్టో కాదో కొన్ని రోజుల్లో తెలియనుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్కన రాశీ ఖన్నా, నివేత థామస్, నందితరాజ్ నటిస్తున్నారు. తమన్నా స్పెషల్ సాంగ్ చేయనుంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 21 న థియేటర్లోకి రానుంది.

Comments

Share.

Comments are closed.