ఎన్టీఆర్ తో మరోసారి స్టెప్పులు వేయనున్న మిల్కీ బ్యూటీ

0

బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ సినిమా టాకీ పార్ట్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. మిగిలి ఉన్న పాటల్లో ఒక పాటను రీసెంట్ గా హైదరాబాద్ లోని ఓ స్టూడియోలో వేసిన అందమైన సెట్ లో రాశీ ఖన్నా, తారక్ పై కంప్లీట్ చేశారు, ఇంకొక పాట రామోజీ ఫిలిం సిటీ లో వేసిన భారీ సెట్ లో 200 మంది డాన్సర్ ల మధ్య చిత్రీకరిస్తున్నారు. ఇక మిగిలి ఉన్నది ఒకే ఒక ఐటెం సాంగ్. జనతా గ్యారేజ్ చిత్రంలో పక్కా లోకల్ సాంగ్ మాస్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. వారి కోసం ఇందులోనూ ఓ స్పెషల్ సాంగ్ ని రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. ఈ పాటలో అందాలు ఆరబోయడానికి మిల్కీ బ్యూటీ తమన్నాని సెలక్ట్ చేసినట్లు ఫిలింనగర్ వాసులు చెబుతున్నారు.

ఊసరవెల్లి సినిమాలో తమన్నా, ఎన్టీఆర్ కలిసి నటించారు. ఇప్పుడు ఒక పాటలో కలిసి డ్యాన్స్ వేయనున్నారు. ఇద్దరూ సూపర్ డ్యాన్సర్లు… వీరి కాంబినేషన్లో రాబోతున్న సాంగ్ ఓ ఊపు ఊపడం గ్యారంటీ. ఎన్టీఆర్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాశీ ఖన్నా, నివేత థామస్, నందిత రాజ్ లు కనివిందు చేయనున్నారు. వీరికి తమన్నా తోడు అయింది. భారీ అంచనాలు నెలకొని ఉన్న ఈ సినిమా సెప్టెంబర్ 21 న రిలీజ్ కానుంది.

Comments

Share.

Comments are closed.