సెప్టెంబర్ 3న జైలవకుశ ఆడియో

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి మూడు విభిన్న పాత్ర‌ల‌లో న‌టిస్తున్న చిత్రం జై ల‌వ‌కుశ‌. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 21న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ఎన్టీఆర్ మూడు లుక్స్ విడుద‌ల చేసి అభిమానుల‌లో సినిమాపై భారీ అంచ‌నాలు పెంచిన టీం తాజాగా దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీత సార‌ధ్యంలో రూపొందిన బాణీల‌ను విడుద‌ల చేసేందుకు టైం ఫిక్స్ చేసింది.

సెప్టెంబ‌ర్ 3న ఆడియో విడుదల చేయ‌నుంది చిత్ర బృందం. ఇక అభిమానుల కోసం సెప్టెంబ‌ర్ 10న హైద‌రాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసిన‌ట్టు నిర్మాత‌లు తెలిపారు. ట్రైల‌ర్ కూడా ఇదే రోజు విడుద‌ల చేస్తామన్నారు. ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల‌లో కురుస్తున్న భారీ వ‌ర్షాలు, గ‌ణేష్ నిమజ్జ‌నం సంద‌ర్భంగా అభిమానుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు వారు వెల్ల‌డించారు. 

రాశీ ఖ‌న్నా, నివేదా థామ‌స్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా ఐటెం సాంగ్‌తో అల‌రించ‌నున్న‌ట్టు స‌మాచారం. సెప్టెంబ‌ర్ 3న ఆడియో సాంగ్స్ విడుద‌ల‌, సెప్టెంబ‌ర్ 10న గ్రాండ్ వేడుక‌, సెప్టెంబ‌ర్ 21న చిత్రం విడుద‌ల‌… ఇలా ఒకే నెల‌లో ఎన్టీఆర్ అభిమానుల‌కి పసందైన విందు అందించ‌నున్నాడు ఎన్టీఆర్. మ‌రి అభిమానులు ఈ సంద‌డిలో భాగం అయ్యేందుకు మీరు సిద్దంగా ఉండండి.

Comments

Share.

Comments are closed.