ముద్దుగుమ్మల మధ్య తారక్‌

0

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. బాబీ దర్శకుడు. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. సెప్టెంబరు 3న ఈ చిత్రం ఆడియోను నేరుగా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆడియో పోస్టర్లను విడుదల చేశారు. ఇందులోని ఒక పోస్టర్‌లో తారక్‌తోపాటు తొలిసారి రాశీ, నివేదా కనిపించడం విశేషం. సినిమాలోని ఓ పాట స్టిల్‌ ఇదని చిత్ర బృందం తెలిపింది. మరో పోస్టర్‌లో ‘జై’, ‘లవ’, ‘కుశ’ కనిపించారు. వీరు ముగ్గురూ కలిసి ఉన్న తొలి ప్రచార చిత్రమిది.

‘జై లవకుశ’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించని కారణంగా అభిమానుల కోసం ఈ నెల 10న ఘనంగా వేడుకను ఏర్పాటు చేయనున్నారు. అప్పుడే సినిమా ట్రైలర్‌ను కూడా విడుదల చేస్తారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఇందులో తారక్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. సెప్టెంబరు 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Comments

Share.

Comments are closed.