భారీ ధరకు అమ్ముడుపోయిన జై లవకుశ హిందీ థియేటర్ రైట్స్

0

వరుసగా హిట్లు… వైవిధ్యమైన కథ… నందమూరి అన్నదమ్ముల కలయికలో వస్తున్న తొలి ప్రాజక్ట్ “జైలవకుశ”. ఈ చిత్రం మొదలయినప్పటి నుంచి అభిమానులను ఊరిస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తుండడం, అందులోను నెగటివ్ షేడ్స్ కలిగిన రోల్ చేస్తుండడంతో దీనిపై విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. ఇప్పటికే విడుదలయిన మూడు టీజర్లు, పాటలతో పాటు మొన్న విడుదలయిన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం భారీగా పెంచేసాయి. డిస్ట్రిబ్యూటర్లు సినిమా థియేటర్ రైట్స్ ని భారీ ధర చెల్లించి దక్కించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం తెలుగు రాష్ట్రాల రైట్స్ ని నిర్మాత కళ్యాణ్ రామ్ 85 కోట్లకు అమ్మేసారు.

తాజాగా ఈ మూవీ హిందీ థియేటర్ రైట్స్ ని జీ సినిమా వారు 11 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇంత మొత్తంలో డబ్బింగ్ హక్కులు పలకడం తారక్ సినిమాల చరిత్రలో ఇదే తొలిసారి. ఈ క్రేజ్ చూస్తుంటే ఈ మూవీ రిలీజ్ తర్వాత అనేక రికార్డ్స్ ని బద్దలు కొడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న జై లవకుశ సెప్టెంబర్ 21 న థియేటర్లోకి రానుంది.

Comments

Share.

Comments are closed.