ఎన్టీఆర్ ని చూసి గర్వపడుతున్నా – రాజమౌళి

0

అత్యధిక స్క్రీన్లలో ఈరోజు రిలీజ్ అయిన జై లవ కుశ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో తారక్ హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ అద్భుతహా అనిపిస్తోంది. ఎన్టీఆర్ నటనకు బాబీ టేకింగ్, దేవీ శ్రీ ప్రసాద్ రీరికార్డింగ్ మరింత బలాన్ని ఇచ్చాయి. ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్ తో, సెకండాఫ్ ఎమోషన్స్ తో సాగిన ఈ సినిమా ఎన్టీఆర్ అభిమానులకు కన్నులపండగగా ఉంది. ఈ సినిమా తొలి షో చూసిన దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. “తారక్.. నా హృదయం గర్వంతో నిండిపోతోంది.

మాటల్లో నా ఫీలింగ్స్ ని చెప్పలేకపోతున్నా .. జై.. జై.. జై లవకుశ” అని ఎన్టీఆర్ ని అభినందనలతో ముంచెత్తారు. జై క్యారెక్టర్ లో ఆధునిక రావణాసురుడిగా ఎన్టీఆర్ నటన అమోఘమని ప్రశంసించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తిరగరాస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 

Comments

Share.

Comments are closed.