‘జై’కు రామ్‌చరణ్‌ ప్రశంస

0

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన ‘జై లవ కుశ’ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన సినీప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో రామ్‌చరణ్‌ కూడా చేరిపోయారు. ‘జై లవకుశ’ చిత్రాన్ని చూసిన రామ్‌చరణ్‌.. ఎన్టీఆర్‌కు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్‌ నటన, ముఖ్యంగా ‘జై’ పాత్రలో ఆయన పలికిన సంభాషణలు, హావభావాలు ఆకట్టుకున్నాయని రామ్‌చరణ్‌ పేర్కొన్నారు. వీరిద్దరూ కలిసి విజయ చిహ్నం చూపుతున్న ఓ ఫొటోను రచయిత కోన వెంకట్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంలో నటించిన ఈ చిత్రానికి కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించగా.. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మించారు. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం మంచి విజయాన్నిఅందుకుంది.

Comments

Share.

Comments are closed.