ప్రస్తుతం ఎన్టీఆర్.. ‘జైలవకుశ’విజయాన్ని అస్వాదిస్తున్నారు. త్వరలో ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రంలో తారక్ మిలిటరీ అధికారి పాత్రలో కన్పించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.
తారక్ ‘బాద్షా’, ‘టెంపర్’ చిత్రాల్లో పోలీసు అధికారి పాత్రలో మెరిశారు కానీ మిలిటరీ గెటప్‌లో ఇప్పటివరకు కన్పించలేదు. తారక్‌ని ఆ గెటప్‌లో చూసే అవకాశం త్రివిక్రమ్ సినిమాతో రాబోతోంది. మిలిటరీ పాత్ర అయినంత మాత్రాన ఇదేమీ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిస్తున్న చిత్రం కాదని తారక్ మీడియా ద్వారా వెల్లడించారట.
ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళంలోనూ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తారక్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ను ఎంపిక చేసుకున్నారట. ప్రస్తుతం త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలోనూ అనునే కథానాయికగా నటిస్తుండటం విశేషం.
Source: Eenadu