సెలబ్రేషన్ లో జైలవకుశ

0

బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రం గత నెల 21 న రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. జై, లవ, కుశ పాత్రల్లో తారక్ అద్భుతంగా నటించి మరో విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ మూవీ వారం రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 20 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి కొత్త రికార్డును లిఖించింది. తారక్ గత చిత్రం జనతా గ్యారేజ్ 135 కోట్లు వసూలు చేసింది. ఆ రికార్డుని జై లవకుశ బద్దలు కొట్టింది.

ఈ సందర్భాన్ని చిత్ర యూనిట్ సెలబ్రేట్ చేసుకుంటోంది. ముఖ్యంగా ఈ సినిమా రైటింగ్ టీమ్ లో ఒకరైన కోన వెంకట్ ఈరోజు ఎన్టీఆర్ కి స్వీట్ తినిపించి సంబరాలను ప్రారంభించారు. ఫ్యాన్స్ కూడా తమ హీరో చిత్రం అరుదైన రికార్డుని సాధించినందుకు ఆనందంగా ఉన్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో బాహుబలి కంక్లూజన్ తర్వాత ఖైదీ నంబర్ 150 చిత్రం 164 కోట్లతో, శ్రీమంతుడు 156 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు చిత్రాలను జై లవకుశ మూవీ దాటుకుంటూ పోతుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా వేస్తున్నారు.

Comments

Share.

Comments are closed.