ఎన్టీఆర్ తరువాతి డైరెక్టర్ అతనే

0

జై లవకుశ విజయంతో ఎన్టీఆర్ ఆనందంలో ఉన్నారు. కొంతకాలం కుటుంబంతో కలిసి విహరించనున్నారు. రెండు నెలల బ్రేక్ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా మొదలు పెట్టనున్నారు. జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీ షూటింగ్ షురూ కాకముందే నెక్స్ట్ డైరక్టర్ ని ఎన్టీఆర్ ఫైనల్ చేశారు. “ఇష్క్‌”, “మనం”, “24 “… సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న విక్రమ్ కె కుమార్ తో పని చేయనున్నారు.

ప్రస్తుతం విక్రమ్ అఖిల్ తో హలో మూవీ చేస్తున్నారు. అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్లో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్ లో హలో థియేటర్లోకి రానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ని వైవిధ్యమైన కథలో చూపించనున్నారు. ఈ కాంబినేషన్లో మూవీ అంటే విపరీతమైన క్రేజ్ నెలకొనడం గ్యారంటీ.

Comments

Share.

Comments are closed.