ఎన్టీఆర్ లక్ష్యం “వైవిధ్యమైన సినిమా”!

0

“నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ” సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టి.. ప్రస్తుతం యూరప్ లో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్,.. ట్రిప్ అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ రెండూ కాకుండా మరో ఫెంటాస్టిక్ కాంబినేషన్ ను ఎన్టీయార్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఈమధ్యకాలంలో రొటీన్ కథలను, మాస్ మసాలా ఎంటర్ టైనర్స్ ను పక్కన పెట్టి కాస్త వైవిధ్యమైన కథలను ఎంచుకొంటున్న ఎన్టీయార్ ఆ ధోరణిని కంటిన్యూ చేస్తూ తన తదుపరి చిత్రానికి దర్శకుడిగా విక్రమ్ కుమార్ ను ఎంపిక చేసుకొన్నట్లు తెలుస్తోంది.

తెలుగులో “ఇష్క్, మనం” తమిళంలో “24” సినిమాలు తీసి జోనర్ ఏదైనా “వైవిధ్యం” కంపల్సరీ అంటూ కెరీర్ ను కొనసాగిస్తున్న విక్రమ్ కుమార్ ప్రస్తుతం అఖిల్ హీరోగా “హెలో” అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. డిసెంబర్ లో విడుదలవ్వనున్న ఈ సినిమా అనంతరం విక్రమ్ ఓ తమిళ చిత్రం తీసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. ఆ తమిళ సినిమా అనంతరం ఎన్టీయార్ హీరోగా ఒక సినిమా తీస్తాడట. ఆల్రెడీ కథ రెడీ అయిపోయిందని, ఎన్టీయార్ కి సింగిల్ లైన్ నేరేట్ చేయగా… బాగా నచ్చిందని టాక్. సో, హీరో క్యారెక్టరైజేషన్ ను ఫెంటాస్టిక్ గా క్రియేట్ చేసే విక్రమ్ కుమార్ తమ అభిమాన కథానాయకుడు ఎన్టీయార్ ను ఎంత వైవిధ్యంగా చూపిస్తాడా అని అభిమానులు ఇప్పట్నుంచే వెయిటింగ్.

Comments

Share.

Comments are closed.