ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రికార్డ్…

0

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఆల్ మోస్ట్ 80.5 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సత్తా చాటింది. దాంతో పాటే బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ దిశగా అడుగులు వేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా 85 కోట్ల షేర్  వైపు అడుగులు వేస్తుంది.


కాగా పక్క రాష్ట్రం కర్ణాటక లో జైలవకుశ మొత్తంగా 8.9 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా ఎన్టీఆర్ కి అక్కడ వరుసగా 6వ ఏడాది కూడా ఎలాంటి ఫ్లాఫ్ లేకుండా అల్టిమేట్ రికార్డ్ ను ఇప్పటికీ కంటిన్యు చేసిందని చెప్పొచ్చు.


కర్ణాటక లో ఎన్టీఆర్ శక్తి తర్వాత నుండి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క సినిమా కూడా ఫ్లాఫ్ అవ్వలేదు అంటే అక్కడ యంగ్ టైగర్ క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు, ఇదే జోరుని ఇప్పుడు జైలవకుశ కూడా కొనసాగిస్తుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది అని చెప్పొచ్చు.

Comments

Share.

Comments are closed.