ఎన్టీఆర్‌ చిత్రంలో అభయ్‌రామ్‌?

0

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. సోమవారం ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్‌నిచ్చారు.

అయితే ఈ చిత్రంలో తారక్‌ తనయుడు అభయ్‌రామ్‌ ఓ చిన్న పాత్రలో కన్పించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలోనూ అభయ్‌రామ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తారక్‌ సినిమా షూటింగుల్లో అభయ్‌రామ్‌ కూడా సందడి చేస్తుంటాడు.

అభయ్‌రామ్‌ పాత్ర గురించి తారక్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల రవితేజ్‌ నటించిన ‘రాజా దిగ్రేట్‌’ చిత్రంలో రవితేజ చిన్నప్పటి పాత్రలో ఆయన కుమారుడు మహాధన్‌ నటించాడు. మహేశ్‌ బాబు నటించిన ‘నేనొక్కడినే’ చిత్రంలో మహేశ్‌ చిన్నప్పటి పాత్రలో ఆయన తనయుడు గౌతమ్‌ నటించాడు. ఇక తారక్‌ తనయుడిని తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

Comments

Share.

Comments are closed.