టాలీవుడ్ చరిత్రలో చారిత్రిక రికార్డ్ అందుకున్న ఎన్టీఆర్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో భీభత్సం సృష్టిస్తుంది. తొలి రోజు నుండే ఇండస్ట్రీ రికార్డులు నమోదు చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా తర్వాత రోజుల్లో కూడా ఈ రికార్డుల పర్వం కంటిన్యు చేస్తూ సంచలనం సృష్టిస్తుంది. కాగా ఇప్పుడు టాలీవుడ్ చరిత్రలో ఏ హీరో కి లేని ఓ చారిత్రిక రికార్డును ఎన్టీఆర్ కి వచ్చేలా చేసింది ఈ సినిమా.

నాన్నకుప్రేమతో జనతాగ్యారేజ్ మరియు జైలవకుశ సినిమాలతో ఓవర్సీస్ లో వరుసగా 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అధిగమించి ఈ చారిత్రిక రికార్డును అందుకున్న ఎన్టీఆర్ సంచలనం సృష్టించాడు. ఈ రికార్డు టాలీవుడ్ హీరోలలో ఎవ్వరికీ లేదనే చెప్పాలి.

కమర్షియల్ మూవీస్ ఓవర్సీస్ లో పెద్దగా ఆడవు అన్న అపవాదుని సైతం చెరిపేస్తూ అద్బుతమైన కలెక్షన్స్ తో ఓవర్సీస్ లో దుమ్ము రేపిన జైలవకుశ  ఓవర్సీస్ మార్కెట్ లో టాలీవుడ్ లో ఎవ్వరికీ లేని రికార్డ్ తో దుమ్ము లేపింది.

Comments

Share.

Comments are closed.