ఎన్టీఆర్‌ రెండో కథానాయికగా ఆమేనా?

0

ప్రస్తుతం ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌తోకలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ఇంకా టైటిల్‌ ఖరారు కాలేదు. ఇందులో తారక్‌కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో త్రివిక్రమ్‌ మరో నాయికను కూడా ఎంపికచేసుకోవాలని అనుకుంటున్నారట. ఆ స్థానంలో పూజా హెగ్దేకు అవకాశం ఇవ్వనున్నట్లు చిత్రవర్గాల సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్‌-పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలోనూ ఇద్దరు కథానాయికలు ఉన్నారు. వారిలో అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ ఉన్నారు.

తారక్‌తో చిత్రాన్ని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారట. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమానికి పవన్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 2018 జనవరి నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుంది. త్వరలో సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు. మరోపక్క పవన్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం 2018 జనవరిలో విడుదల కాబోతోంది.

Comments

Share.

Comments are closed.