త్రివిక్రమ్ సినిమాలో డిటెక్టివ్’గా ఎన్టీఆర్ ?

0

పాతికేళ్ల క్రితం డిటెక్టివ్ నవలలకు, సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. ఈ మధ్య ఆ ఊసే లేదు. కానీ అప్పటి డిటెక్టివ్ నవలకు నేటి పరిస్థుతలకు అనుగుణంగా మార్చే పనిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాతో బిజీగా ఉన్న త్రివిక్రమ్.. దీని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మూవీ చేయనున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. మార్చి లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. 1980లలో వచ్చిన ఓ డిటెక్టివ్ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం.

ఇప్పటికే త్రివిక్రమ్‌ ఆ నవల హక్కులను సొంతం చేసుకున్నారని తెలిసింది. అందులో డిటెక్టివ్ రోల్ ని ఎన్టీఆర్‌ పోషించనున్నట్లు టాక్. ఇప్పటివరకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఫ్యామిలీ కథ అని ప్రచారంలో ఉన్నింది. మరి ఇప్పుడు డిటెక్టివ్ సినిమా అని రూమర్ వచ్చింది. మరి ఈ రెండింటిలో ఏది నిజమో ఇప్పుడే చెప్పలేము.

Comments

Share.

Comments are closed.