భద్రాద్రి రాముని సన్నిధిలో ఎన్టీఆర్‌

0

సినీనటుడు ఎన్టీఆర్‌ సతీసమేతంగా శుక్రవారం భద్రాద్రి సీతారాముల్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులకు దేవస్థానం సిబ్బంది ఆహ్వానం ప‌లికారు. అనంతరం తారక్‌ కుటుంబం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. తర్వాత స్వామి వారి తీర్ధప్రసాదాలను ఆలయసిబ్బంది వారికి అందజేశారు. ఈ సందర్భంగా క్షేత్ర విశిష్టతను ఎన్టీఆర్‌ అడిగి తెలుసుకున్నారు.

రామాయణంలోని పాత్రలను ఇతివృత్తంగా తీసుకుని ఎన్టీఆర్‌ నటించిన ‘జై లవకుళ’ దసరా కానుకగా విడుదలై ఘనవిజయం సాధించింది. బాలనటుడిగా ఎన్టీఆర్‌ ‘రామాయణం’ చిత్రంలో నటించారు. ఎన్టీఆర్‌తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా సతీసమేతంగా స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వీరితో పాటు పలువురు నిర్మాతలు స్వామి వారిని దర్శించుకున్నారు.

Comments

Share.

Comments are closed.