ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి అరుదైన గుర్తింపు

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ షో టెలివిజన్ రికార్డులన్నింటికీ రిపేర్లు చేసింది. టెలివిజన్ రేటింగ్ పాయింట్ లోను, టెలివిజన్ వీవర్స్ పాయింట్ లోను అత్యధిక పాయింట్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో అరుదైన గుర్తింపును అందుకుంది. ఈ సంవత్సరంలో నెటిజనులు గూగుల్ లో అత్యధికంగా వెతికిన ప్రోగ్రాం లో బిగ్ బాస్ తెలుగు ఆరో స్థానం దక్కించుకుంది. ఇది గొప్ప విషయం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్ షో ని మిస్ కాకుండా చూసారు. బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ కు ఓటు వేసే అవకాశాన్ని గూగుల్ లోనే కల్పించారు. ఈ ఓటింగ్ లో శివబాలాజీ టైటిల్ గెలుచుకున్నారు.


ఈ షో తో తనపై విమర్శలు గుప్పించే వారికీ ఎన్టీఆర్ గట్టి పంచ్ ఇచ్చారు. షో బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఫుల్ ఎనర్జీతో మాట్లాడి అందరినీ తన అభిమానులను చేసుకున్నారు. బిగ్ బాస్ మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో రెండో సీజన్ కు స్టార్ మా రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో నిర్మించనున్న ఈ సినిమా ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ క్రేజీ కాబినేషన్లో వచ్చే సినిమా కోసం నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.


Comments

Share.

Comments are closed.