అదిరిపోయే లుక్ లో ఎన్టీఆర్

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమ జోరు మీదున్న విషయం తెలిసిందే. వరుసగా ఒకటి తర్వాత ఒకటి సూపర్ హిట్లు కొడుతూ దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన అప్ కమింగ్ మూవీ ని చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఇప్పటి నుండే కష్టపడబోతున్నాడు. దానికి కారణం ఈ సినిమా ఎన్టీఆర్ రోల్ అలాంటిది అని సమాచారం.


ఈ సినిమాలో  ఎన్టీఆర్ లుక్ చాలా స్లిమ్ గా ఉండాల్సిన అవసరం ఉందట. ఆ లుక్ టెంపర్ లో కన్నా స్లిమ్ గా ఉండాల్సి ఉంటుందని చెప్పడంతో ఎన్టీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడట. కాగా సినిమా షూటింగ్ ఫిబ్రవరి చివర్లో మొదలు కానున్న విషయం అందరికీ తెలిసిందే.


అప్పటికి  ఎన్టీఆర్ లుక్ పూర్తిగా మారిపోతుందని టెంపర్ కన్నా స్లిమ్ ఎన్టీఆర్ ని చూసి అందరు షాక్ అవ్వడం ఖాయమని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.

Comments

Share.

Comments are closed.