పతంగులు ఎగరవేయడం తారక్‌ నేర్పాడు

0

అగ్ర కథానాయకుడు తారక్‌ సంక్రాంతి పండగను చాలా సంబరంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో కూడిన ఫొటోను జిమ్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్టీఆర్‌ నిన్న నాకు పతంగులు ఎలా ఎగురవేయాలో నేర్చించారు’ అని ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. అందులో స్టీవెన్స్‌తోపాటు ఎన్టీఆర్‌ ఉన్నారు. ఎన్టీఆర్‌‌ చాలా హుషారుగా ఉన్న ఈ ఫొటో సోషల్‌మీడియాలో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. బాలీవుడ్‌ స్టార్స్‌ రణ్‌వీర్‌ సింగ్‌, హృతిక్‌ రోషన్‌ కూడా స్టీవెన్స్‌ దగ్గరే శిక్షణ తీసుకుంటున్నారు.


ఎన్టీఆర్‌ ఇటీవల ‘జై లవకుశ’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించనున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఫిబ్రవరిలో షూటింగ్‌ ప్రారంభం కానుందట. ఈ సినిమాలో నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరికొత్త లుక్‌లో కనిపించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌-ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Comments

Share.

Comments are closed.