బుల్లి తెరపై దుమ్ము రేపిన ‘జై లవ కుశ’ !

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జై లవ కుశ’ చిత్రం ఎంతటి విజయం సాధించింది అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో నటుడిగా ఇంకో మెట్టు పైకెక్కారు తారక్. ఆయన చేసిన త్రిపాత్రాభినయానికి ముగ్దులయ్యారు తెలుగు ప్రేక్షకులు. అందుకే సినిమాకు అంతటి విజయాన్ని కట్టబెట్టారు. అలాగే బుల్లితెరపై కూడా విశేషంగా ఆదరించారు కుటుంబ ప్రేక్షకులు.


చిత్ర శాటిలైట్ హక్కుల్ని దక్కించుకున్న జెమినీ టీవీ ఈ నెల 13వ తేదీన ప్రసారం చేయగా 17.7 టీఆర్ఫీ రేటింగ్ (1,28,40,000 ఇంప్రెషన్స్) దక్కాయి. బాబీ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడిగా రాశీఖన్నా, నివేత థామస్ లు నటించారు. ఇకపోతే ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్దమవుతున్న సంగతి విధితమే.


Comments

Share.

Comments are closed.