తమిళ్ లో రీమేక్ అవుతున్న జైలవకుశ

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో మరిచిపోలేని సినిమాలలో ముందు నిలిచే సినిమా జైలవకుశ. మూడు విభిన్న పాత్రలను ఒకేసారి చేయడం అందునా ఒక పాత్ర కి నెగటివ్ షేడ్స్ ఉండటం అవన్నీ ఎన్టీఆర్ కే చెల్లెలా చేసింది ఈ సినిమా. నటుడిగా ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కి ఎన్టీఆర్ కి ఎనలేని పేరుని తీసుకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు కోలివుడ్ లో రీమేక్ అవుతుందా అంటే అవుననే అంటున్నారు.


కోలివుడ్ టాప్ హీరోల కళ్ళు ఈ సినిమాపై ఉన్నాయని ముందు వరుసగా సూర్య మరియు అజిత్ లు ఉన్నారనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. సూర్య ఇలాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడతాడు కాబట్టి సూర్య నే సినిమాను ఓకే చేసే అవకాశం ఉందని అంటున్నారు.


అలాగే అజిత్ కుమార్ కెరీర్ లో ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఉన్న హిరో క్యారెక్టర్స్ చేసి మెప్పించాడు…అందుకే ఈ సినిమాలో జై పాత్రకి పూర్తీ న్యాయం చేసే సత్తా అజిత్ కి ఉందని అంటున్నారు. అందుకే ఈ ఇద్దరు హీరోలలో ఎవరో ఒకరు ఈ సినిమా రీమేక్ ని ఓకే చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Comments

Share.

Comments are closed.