ఎన్టీఆర్ మూవీ కథ అదే

0

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దెబ్బ తిన్న పులిలా ఉన్నారు. అజ్ఞాతవాసి ఫలితం తారుమారు కావడంతో తన నెక్స్ట్ సినిమాపై బాగా దృష్టిపెట్టారు. కొన్ని రోజులుగా స్క్రిప్ట్ రైటింగ్ పై కూర్చున్న త్రివిక్రమ్ కథలో భారీ మార్పులు చేసినట్లు సమాచారం. ఏ కోశానా ఇతర సినిమాలోని సన్నివేశాల ఛాయలు కనిపించకుండా జాగ్రత్త పడినట్లు తెలిసింది. స్వచ్ఛమైన తెలుగు మూవీ స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు టాక్. ఫిలిం నగర్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం… ఇది కుటుంబ కథా చిత్రమట. ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా ఎన్టీఆర్ ని దృష్టిలో పెట్టుకొని మంచి సెంటిమెంట్ సీన్లు రాసుకున్నట్లు వెల్లడించారు.


ఇక ఎన్టీఆర్ అయితే పాత్రకు తగినట్లుగా ఉండాలని నిపుణుల సమక్షంలో బరువుతగ్గి యువకుడిలా మారిపోనున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొత్తగా కనిపించబోతున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్నఎన్టీఆర్ 28 వ సినిమాలో హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. కొత్త అమ్మాయిని ఎన్టీఆర్ కి జోడీగా పరిచయం చేయాలనీ చిత్ర బృందం భావిస్తోంది. ఇక ముందు అనిరుద్ ని అనుకున్నప్పటికీ చివరికి దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలూ అందించనున్నారు. తొలిసారి త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.


Comments

Share.

Comments are closed.